Mini vic.gov.au

This is a low bandwidth version of vic.gov.au. Contents may not be up to date. © Copyright State Government of Victoria

శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్) (Early Start Kindergarten) - తెలుగు (Telugu)

On this page

మీరు శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుండి వచ్చినట్లయితే, మీరు శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్ - ESK) కి అర్హులు కావచ్చు. మీబిడ్డ కోసం ప్రతివారం సాధ్యమైనంత గరిష్ట మొత్తంలో ఉచిత బాలశిక్షణ (Kinder) కార్యక్రమ సమయం పొందేలా శిశు పాఠశాల సహాయపడుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

శిశుపాఠశాల, అర్హత కలిగిన ఉపాధ్యాయుని ద్వారా అందించబడే అన్ని బాలశిక్షణా కార్యక్రమాల్లో లభ్యం అవుతుంది. మీకు సమీపంలో ఉన్న బాల శిక్షణాలయాన్ని సంప్రదించి, శిశుపాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్) ధనసహాయాన్ని అందుకోమని అడగడం ద్వారా మీరు మీ బిడ్డను నమోదు చేసుకోవచ్చు. మీ భాషలో వ్రాతపూర్వక సమాచారాన్ని అందించడానికి కిండర్ సేవలు ఉచిత అనువాద సేవను పొందవచ్చు.

సహాయం కోసం మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క మూడేండ్ల బాలల, బాల శిక్షణాలయం విచారణ నంబరు 1800 338 663 కు ఫోన్ చేయవచ్చు లేదా మీ స్థానిక పురపాలక సంఘాన్ని సంప్రదించవచ్చు. మీ భాషలో సహాయం పొందడం కొరకు మీరు నేషనల్ ట్రాన్స్ లేటింగ్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ సర్వీస్ కు 131 450 కు ఫోన్ చేయవచ్చు. ఆ అనువాదకుని, మీ స్థానిక పురపాలక సంఘం లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు ఫోన్ చేయమని అడగండి. అనువాదకులు ఫోన్ లో ఉండి తర్జుమా చేస్తారు.

ఎప్పుడు దరఖాస్తు చేయాలి

మూడేళ్ల బాలశిక్షణాలయంలో చేరేందుకు నమోదు చేసుకున్న సంవత్సరంలో ఏప్రిల్ 30 లోపు మూడు సంవత్సరాలు నిండినట్లయితే పిల్లలు ESKకి అర్హులు. ‘ఎప్పుడు నమోదు చేసుకోవాలో’ చూడండి.

మీ బిడ్డ జనవరి 1 మరియు ఏప్రిల్ 30 మధ్య జన్మించినట్లయితే, వారు మూడేళ్ల బాలశిక్షణాలయంలో ఏ సంవత్సరం ప్రారంభించాలో మీరు ఎంచుకోవచ్చు. మీ బిడ్డకు 3 సంవత్సరాలు నిండిన సంవత్సరంలోనే లేదా 4 సంవత్సరాలు నిండిన సంవత్సరంలో మూడేళ్ల బాలశిక్షణాలయం ప్రారంభించవచ్చు. మీ బిడ్డకు 3 సంవత్సరాలు నిండినప్పుడు మూడేళ్ల బాలశిక్షణాలయం ప్రారంభిస్తే, వారు 5 సంవత్సరాలు నిండినప్పుడు పాఠశాలకు వెళ్లడం ప్రారంభిస్తారు. మీ బిడ్డకు 4 సంవత్సరాలు నిండినప్పుడు మీరు వారిని మూడేళ్ల బాలశిక్షణాలయంకు పంపాలని ఎంచుకుంటే, వారు 6 సంవత్సరాలు నిండినప్పుడు పాఠశాలకు వెళ్లడం ప్రారంభిస్తారు.

మీ బిడ్డ శిశు పాఠశాలకి ఎప్పుడు అర్హత సాధిస్తారో లెక్కకట్టటానికి మీకు సహాయం అవసరమైతే, మీరు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని కాని, మీ స్థానిక పురపాలకసంఘాన్ని కాని, మీ మాతా మరియు శిశు ఆరోగ్య ఉపచారికని కాని, లేదా మీ ప్రాంతంలోని ఒక కిండర్, లేదా మీ ప్రాంతంలోని దిగువ పేర్కొన్న సంస్థల్లో దేనినైనా సంప్రదించవచ్చు:

నా బిడ్డ నాలుగు సంవత్సరాల బాలశిక్షణాలయానికి వెళ్ళాలా?

అవును, శిశు శిక్షణా కేంద్రం లో అర్హత పొందిన పిల్లలు ఉచిత లేదా తక్కువ ధర కలిగిన నాలుగేళ్ల కు కూడా అర్హులు. 2025 నాటికి, నాలుగు సంవత్సరాల బాలశిక్షణాలయం క్రమంగా ముందస్తు సన్నాహం (ప్రీ-ప్రిపరేషన్) గా మారుతోంది. 2026 నాటికి, క్రింది తరహా పిల్లలకు ప్రతి వారం 25 గంటల వరకు ముందస్తు సన్నాహం (ప్రీ-ప్రిపరేషన్) అందుబాటులో ఉంటుంది:

గత సంవత్సరంలో ESK ద్వారా నమోదు చేసుకోవడం వల్ల మీ బిడ్డ విక్టోరియాలో ఎక్కడ నివసిస్తున్నా, ప్రతి వారం పెరిగిన ముందస్తు సన్నాహ (ప్రీ-ప్రెప్) గంటలను పొందగలరని హామీ ఇస్తుంది. గత సంవత్సరంలో ESKలో నమోదు చేసుకోకపోయినా కుటుంబాలు ముందస్తు సన్నాహం (ప్రీ-ప్రిపరేషన్‌)కు అర్హులు అవుతారు.

Updated 26 March 2026



About the VIC Government

Grants and programs

Jobs and careers

Arts, culture and heritage

Business and the workplace

Communities

Education and training

Environment, water and energy

Finance and economy

Health and social support

Housing and property

Law and justice

Safety and emergencies

Science and technology

Sport and recreation

Traffic and transport

Working in the Victorian Government