Mini vic.gov.au

This is a low bandwidth version of vic.gov.au. Contents may not be up to date. © Copyright State Government of Victoria

బాలశిక్షణ ఎలా పనిచేస్తుంది (How kinder works) - తెలుగు (Telugu)

On this page

బాలశిక్షణ, ‘బాల శిక్షణాలయం’ లేదా ‘బాల్యవిద్య’ అని కూడా పిలుస్తారు, ఇది మీ పిల్లల అభివృద్ధి మరియు అభ్యాసంలో ముఖ్యమైన భాగం. 3 సంవత్సరాల వయస్సులో నాణ్యమైన కిండర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం వలన వారు జీవితంలో మరియు పాఠశాలలో బాగా రాణించడానికి నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.

మీరు మీ బిడ్డ పుట్టిన తేదీని, స్టార్టింగ్ ఏజ్ కాలిక్యులేటర్లో పెట్టి, మూడు మరియు నాలుగేండ్ల బాలల కిండర్ ని మీ బిడ్డ ఏ సంవత్సరం ప్రారంభించవచ్చో తెలుసుకో వచ్చు.

ముందస్తు సన్నాహం (ప్రీ-ప్రిపరేషన్) అంటే ఏమిటి

2025 నాటికి, నాలుగు సంవత్సరాల బాలశిక్షణాలయం ముందస్తు సన్నాహం (ప్రీ-ప్రిపరేషన్) గా మారింది.

2026 నుండి, క్రింది తరహా పిల్లలకు ప్రతి వారం 16 నుండి 25 గంటల ముందస్తు సన్నాహం (ప్రీ-ప్రిపరేషన్) అందుబాటులో ఉంటుంది::

ముందస్తు సన్నాహం (ప్రీ-ప్రిపరేషన్) ఆట-ఆధారితంగా కొనసాగుతుంది మరియు అర్హత కలిగిన చిన్న పిల్లల ఉపాధ్యాయులచే నిర్వహించబడుతుంది.

అదనపు గంటలు పిల్లలకు ఆటల ద్వారా నేర్చుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను మరియు విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎక్కువ సమయాన్ని ఇస్తాయి.

ముందస్తు సన్నాహం (ప్రీ-ప్రిపరేషన్) స్వతంత్ర (సెషనల్) బాలశిక్షణాలయాలు మరియు పొడిగించబడిన సంరక్షణ కేంద్రాల (లాంగ్ డే కేర్ సెంటర్ల) ద్వారా అందించబడుతుంది.

ముందస్తు సన్నాహం (ప్రీ-ప్రిపరేషన్), నాలుగు సంవత్సరాల కిండర్ గార్టెన్ మరియు మూడు సంవత్సరాల కిండర్ ఉచిత కిండర్ లో భాగం. ఉచిత కిండర్ గురించి మరింత తెలుసుకోండి.

బాల శిక్షణాలయం సమయం

నిధులతో కూడిన మూడు సంవత్సరాల బాలశిక్షణాలయ కార్యక్రమాలు వారానికి 5 నుండి 15 గంటలు అందుబాటులో ఉంటాయి. నిధులతో కూడిన నాలుగు సంవత్సరాల బాలశిక్షణాలయ కార్యక్రమాలు వారానికి 15 గంటలు అందుబాటులో ఉంటాయి.

విక్టోరియాలో, ప్రతి వారం గంటలు క్రమంగా 15 నుండి 30కి పెరుగుతూ నాలుగేళ్ల కిండర్ ప్రీ-ప్రిపరేషన్ అవుతోంది.

నిరూపితమైన ఫలితాలు

బాల శిక్షణా కార్యక్రమానికి వెళ్ళే బాలలు, అక్షరాలు మరియు సంఖ్య లను ఎలా గుర్తించాలి, ఎలా లెక్కించాలి మరియు సమస్యలను ఎలా పరిష్కరించాలి వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ బిడ్డ, తన ఆత్మవిశ్వాసాన్ని మరియు స్వతంత్రతను బాలశిక్షణ కేంద్రం వద్ద పెంపొందించుకుంటారు. సామాజిక మరియు భావోద్వేగ నైపుణ్యాలను కూడా నేర్చుకుంటారు. వారు సామాజిక చైతన్యాన్ని మరియు కొత్త స్నేహితులను పొందుతారు.

మీ బిడ్డ నిరంతరం కిండర్ కు హాజరైనప్పుడు, వారు తమ సహచరులతో మరియు విద్యావేత్తలతో లోతైన సంబంధాలు కలిగి ఉంటారు. ఈ స్వంత భావన మీ బిడ్డ విలువైనదిగా, సురక్షితంగా మరియు నమ్మకంగా భావించి, అన్వేషించడానికి మరియు నేర్చుకోవడాన్ని ఆస్వాదించడానికి సహాయపడుతుంది.

కిండర్ యొక్క ఊహాజనితం మరియు దినచర్యలు మీ బిడ్డ ఒక సమూహంలో నేర్చుకోవడం పట్ల మరింత నమ్మకంగా ఉండటానికి సహాయపడే మనఃస్థైర్యాన్ని అందిస్తాయి. క్రమం తప్పకుండా కిండర్ కి వెళ్లడం మీ బిడ్డ పాఠశాలకు సజావుగా మారడానికి సహాయపడుతుంది. ఎందుకంటే కిండర్‌కు నిరంతరం హాజరయ్యే పిల్లలు పాఠశాల ప్రారంభించిన తర్వాత వారు పాల్గొనే స్థాయిని కొనసాగించే అవకాశం ఉంది.

16 సంవత్సరాల వయస్సులో, పాఠశాల ప్రారంభించే ముందు 2 లేదా 3 సంవత్సరాలు కిండర్ ప్రోగ్రామ్‌లో హాజరైన విద్యార్థులు ఆంగ్లము మరియు గణితంలో హాజరు కాని వారి కంటే ఎక్కువ ఫలితాలను కలిగి ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి.

తల్లిదండ్రులు మరియు బాలశిక్షణ అధ్యాపకులు ఏవిధంగా కలిసి పనిచేస్తారు

తల్లిదండ్రులు/సంరక్షకులు, కుటుంబాలు మరియు ఉపాధ్యాయుల మధ్య భాగస్వామ్యంతో బాలశిక్షణ ఉత్తమంగా పనిచేస్తుంది. తల్లిదండ్రులు/సంరక్షకులుగా, మీ బిడ్డ ఎదుగుదలలో మీరు అత్యంత ముఖ్యమైన భాగం. మీరు వారికి తప్పు మరియు ఒప్పుల గురించి, మీ భాషలు, సంస్కృతి, దయ మరియు గౌరవం వంటి విలువలను బోధిస్తారు. ఉపాధ్యాయులు, బాలశిక్షణ కేంద్రంలో ఏమి జరుగుతోంది మరియు మీ బిడ్డ ఇంట్లో నేర్చుకుంటూ వుండటానికి సహాయపడే మార్గాల గురించి, మీతో మాట్లాడతారు. వారు, మీ బిడ్డ ఆసక్తుల గురించి మరియు మీ బిడ్డ ఎలా నేర్చుకోవడానికి ఇష్టపడతారో తెలుసుకోవాలని కోరుకుంటారు.

ఏ సమయంలోనైనా ఒక అనువాదకుని ఏర్పాటు చేయమని మీరు మీ బాలశిక్షణ ఉపాధ్యాయుని అడగవచ్చు. ఇది ప్రత్యక్షంగా కాని లేదా టెలిఫోన్ ద్వారా కాని లేదా వీడియో ద్వారా ఉండవచ్చు. ఈసేవను పొందటానికి కుటుంబాలకు ఎలాంటి ఖర్చు ఉండదు.

మీరు మీ కిండర్‌తో ఇష్టపడే భాషలో మాట్లాడాలనుకుంటే, మీరు ఉచిత తల్లిదండ్రులు మరియు సంరక్షకుల ఇన్-బౌండ్ టెలిఫోన్ అనువాద సేవను ఉపయోగించవచ్చు. ఈ సేవ ప్రస్తుతం 30 భాషలలో అందించబడుతుంది.

మీరు కిండర్ పేరు మరియు ఫోన్ నంబర్‌ను భాష్యకారునికి తెలియజేస్తారు మరియు భాష్యకారుడు లైన్ లో ఉండి మీరు పూర్తి చేసే వరకు అనువదిస్తారు. తల్లిదండ్రులు మరియు సంరక్షకుల కోసం గైడ్‌లోని అంశాలను అనుసరించండి.

బాలశిక్షణ కేంద్రం వద్ద ఏమి జరుగుతుంది

ఆటల ద్వారా పిల్లలనునేర్చుకోవడానికి ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు. కార్యకలాపాలలో, బొమ్మలు గీయటం, పాడటం, ఎక్కటం, త్రవ్వటం, ఆరుబయట పరిగెత్తటం, బొమ్మలతో ఆడుకోవటం మరియు పుస్తకాలు చదవడం వంటివి ఉండవచ్చు. ఇతరులతో పంచుకోవడం మరియు వంతుల వారీగా సహకరించడం ద్వారా, పిల్ల లు వారి ఊహాశక్తిని ఉపయోగించుకోవటానికి మరియు కొత్తవి కనుక్కోవటానికి ఆటలు ప్రోత్సహిస్తాయి. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి మరియు అర్థం చేసుకోవాలి అనే దానితో సహా, బాలలు ధ్వనులు, పదాలు మరియు భాష గురించి నేర్చుకుంటారు.

బాలశిక్షణ మన బహుళ సాంస్కృతిక సమాజంలో భాగం

బాలశిక్షణ కార్యక్రమాలు, అన్ని నేపథ్యాల నుంచి వచ్చిన తల్లిదండ్రులను వారి సంఘంలో భాగం కావడానికి స్వాగతిస్తాయి. ఆ ప్రదేశంలో తల్లిదండ్రులు కలుసుకోవచ్చు, కథలను పంచుకోవచ్చు మరియు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవచ్చు.

ఉపాధ్యాయులు, మీ బిడ్డ మరియు మీ సంస్కృతి గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. ఇది వారికి, సాంస్కృతిక పర్వదినాలు మరియు సంఘటనల ఆధారంగా మీ బిడ్డకు అర్థవంతమైన కార్యకలాపాలను తయారు చేయడానికి మరియు విక్టోరియాలోని వైవిధ్యాన్ని సంబరంగా జరుపుకోవటానికి సహాయపడుతుంది.

ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరినీ కార్యకలాపాలలో చేర్చుకుంటారు. అందువలన, ఇంగ్లీష్ మాట్లాడని బాలలు మిగిలిన వారి వలే ఆడుకోవటానికి మరియు నేర్చుకోవటానికి సమాన అవకాశాలను కలిగి ఉంటారు. కొన్ని కిండర్ కార్యక్రమాలు ఇంగ్లిష్ మాట్లాడని, లేదా తక్కువగా మాట్లాడే బాలలకుసహాయపడే ద్విభాషా విద్యావేత్తలను కలిగి ఉంటాయి. బాలలకు, ఇతరులతో కలిసి మెలగడం, వారిని అంగీకరించటం మరియు సాంస్కృతిక భేదాలను గౌరవించటం కూడా బోధిస్తారు.

కిండర్ ప్రోగ్రామ్‌ల రకాలు

పిల్లలు మూడేళ్ల కిండర్ గార్టెన్ కార్యక్రమానికి లాంగ్ డే కేర్ (దీనిని చైల్డ్ కేర్ అని కూడా పిలుస్తారు) సెంటర్‌లో లేదా స్వతంత్ర (దీనిని సెషనల్ అని కూడా పిలుస్తారు) కిండర్ సర్వీస్‌లో హాజరు కావచ్చు. ఈ సేవలు సాధారణంగా నాలుగు సంవత్సరాల కిండర్ గార్టెన్ కార్యక్రమాన్ని కూడా అందిస్తాయి.

దీర్ఘ కాల పగటి సంరక్షణ కేంద్రం, బాలశిక్షణ కార్యక్రమం తో పాటు పూర్తి రోజు విద్య మరియు సంరక్షణను అందించగలదు. ఉపాధ్యాయుల నేతృత్వంలోని బాలశిక్షణ కార్యక్రమాన్ని అదనపు గంటల విద్య మరియు సంరక్షణతో అనుసంధానించవచ్చు.

స్వతంత్ర బాలశిక్షణా కేంద్రంలో, బాల శిక్షణ కార్యక్రమం నిర్దిష్ట రోజులలో మరియు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పనిచేస్తుంది. స్వతంత్ర బాలశిక్షణా కేంద్రం సాధారణంగా పాఠశాల పనిచేసే సమయంలో సంవత్సరానికి 40 వారాల పాటు పని చేస్తుంది మరియు పాఠశాల సెలవుల సమయంలో అదికూడా సెలవులు తీసుకుంటుంది. ఈ రోజులు మరియు గంటలు బాల శిక్షణా కేంద్రం నిర్ణయిస్తుంది.

Updated 26 March 2026



About the VIC Government

Grants and programs

Jobs and careers

Arts, culture and heritage

Business and the workplace

Communities

Education and training

Environment, water and energy

Finance and economy

Health and social support

Housing and property

Law and justice

Safety and emergencies

Science and technology

Sport and recreation

Traffic and transport

Working in the Victorian Government