Mini vic.gov.au

This is a low bandwidth version of vic.gov.au. Contents may not be up to date. © Copyright State Government of Victoria

కిండర్ కిట్లు (Kinder Kits) - తెలుగు (Telugu)

2025 నాటికి, నిధులతో కూడిన మూడేళ్ల బాలశిక్షణాలయం కార్యక్రమంలో చేరిన ప్రతి బిడ్డ కిండర్ కిట్ పొందేందుకు అర్హులు.

కుటుంబాల కోసం మార్గదర్శని

మీ కిండర్ కిట్ గురించి

మీ బిడ్డను ఆటల్లో నిమగ్నం చేయడం వారి అభ్యాసం మరియు అభివృద్ధికి తోడ్పడటానికి ఒక గొప్ప మార్గం. తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు కుటుంబాలు ఆ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన భాగం.

కిండర్ కిట్‌లు పుస్తకాలు, విద్యాపరమైన బొమ్మలు మరియు మీ పిల్లలు మరియు కుటుంబం ఇంట్లో ఆనందించడానికి తయారు చేసిన కార్యకలాపాలతో నిండి ఉంటాయి.

ప్రతి కిండర్ కిట్‌లో ప్రత్యేకంగా మూడు సంవత్సరాల పిల్లల కోసం తయారు చేయబడిన వస్తువులు ఉంటాయి.

Illustration of three children playing. One is reading a book, one is colouring in, one is holding animal finger puppets.

విక్టోరియన్ ఎర్లీ ఇయర్స్ లెర్నింగ్ మరియు డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్

బాల కేంద్ర ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు మీ బిడ్డ ఎదగడానికి మరియు నేర్చుకోవడానికి మద్దతు ఇస్తారు.

కిండర్ గార్టెన్ కార్యక్రమాలు పిల్లల అభ్యాసం మరియు అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడానికి, విక్టోరియన్ ఎర్లీ ఇయర్స్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ (VEYLDF) ను ఉపయోగిస్తాయి.

మీ కిండర్ కిట్‌లోని ప్రతిదీ VEYLDF లోని ఫలితాలలో 1 లేదా అంతకంటే ఎక్కువ వాటితో అనుసంధానిస్తుంది.

వెనుక మోపు (బ్యాక్‌ప్యాక్)

కిండర్ కిట్ బ్యాక్‌ప్యాక్‌లను ప్రతిరోజూ వస్తువులను తీసుకెళ్లడానికి మరియు ఆడుకోవడానికి ఉపయోగించవచ్చు.

మీ బిడ్డ, వెనుక ఉన్న కార్డ్‌బోర్డ్ ట్యాగ్‌పై చిత్రాన్ని గీయవచ్చు, తద్వారా వారిది ఏ బ్యాక్‌ప్యాకో తెలుస్తుంది.

బ్యాక్‌ప్యాక్‌ జిప్ ని తీసి, ఫెల్ట్ ఉపరితలాన్ని ఊహాత్మక ఆట కోసం ఉపయోగించడానికి వెల్క్రో ట్యాబ్‌లను క్రిందికి అతికించండి.

చదువుట

కుటుంబ సమేతంగా సమయాన్ని గడపడానికి చదవడం గొప్ప మార్గం. అక్షరాస్యత అభివృద్ధి మద్ధతుకి ఇది అత్యంత ముఖ్యమైన మార్గాల్లో ఒకటిగా ఉంటుంది.

మీ బిడ్డతో క్రమం తప్పకుండా కథా-సమయాన్ని పంచుకోవడం వారి ఊహ మరియు పదజాలాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

గీయడం మరియు గుర్తులను తయారుచేయడం

డ్రాయింగ్ మరియు మార్కింగ్ చేయడం పిల్లలు తమను తాము సృజనాత్మకంగా వ్యక్తీకరించడానికి మరియు విశ్వాసాన్ని పెంపొందించడానికి అనుమతిస్తుంది. కాగితంపై క్రేయాన్‌లతో ప్రయోగాలు చేయడం ద్వారా, పిల్లలు:

సృజనాత్మక కార్యకలాపాలు

సృజనాత్మక ఆట మీ పిల్లల 5 ఇంద్రియాలను - దృష్టి, వాసన, వినికిడి, స్పర్శ మరియు రుచిని ప్రేరేపిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి, కనుగొనడానికి మరియు తెలుసుకోవడానికి ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం.

బయట ఆడటం

పర్యవేక్షించబడే బహిరంగ ఆట మీ పిల్లల పెరుగుదల, అభివృద్ధి మరియు శ్రేయస్సులో పెద్ద భాగం.

పిల్లలు చేయగలిగినవి:

నాటకీయ ప్రదర్శన

నాటకీయ ప్రదర్శన పిల్లలను ఊహాత్మక కథలను నటించడానికి మరియు ఇతర పాత్రలను పోషించడానికి ప్రోత్సహిస్తుంది.

పిల్లలు ముఖ్యమైన భాష మరియు సామాజిక నైపుణ్యాలను అభ్యసించడానికి నాటకీయ ప్రదర్శనలను ఉపయోగిస్తారు, వీటిలో:

ఆటలు

మీ పిల్లల సామాజిక నైపుణ్యాలను పెంపొందించడానికి కుటుంబం మరియు స్నేహితులతో ఆటలు ఆడటం గొప్ప మార్గం.

పిల్లలు సంఖ్యాశాస్త్రం, భాష మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఆటలు సహాయపడతాయి.

సమాజ నిర్మాణం

ఆట ద్వారా పిల్లలు తమ గురించి మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కనుగొంటారు మరియు నేర్చుకుంటారు. చిన్నారుల కోసం, ఆట మరియు అభ్యాసం జోడీగా వెళతాయి. మీ కిండర్ కిట్‌లోని అంశాలు వైవిధ్యం మరియు విభిన్న సంస్కృతుల గురించి సంభాషణలు చేయడానికి మీకు మద్దతు ఇస్తాయి.

గుర్తింపును గౌరవించడం

అన్ని సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి పిల్లలను ప్రోత్సహించడం అవగాహన, అంగీకారం మరియు అభిమానాన్ని పెంచుతుంది. విక్టోరియాలో, ఆదిమవాసులు మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ద్వీప సంస్కృతులు మరియు కూరీ సంస్కృతులు నేడు సజీవంగా అభివృద్ధి చెందుతున్నాయి. కిట్‌లలో రచయితలు మరియు కళాకారులుగా వారిని గుర్తించడం మాకు గర్వకారణం.

కూరీ సంప్రదాయాలు మరియు సంస్కృతుల గురించి మీ బిడ్డ మరింత తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి:

అస్లాన్లో పుస్తకాలు

ఆస్లాన్ అనేది విక్టోరియా యొక్క ఎర్లీ చైల్డ్ హుడ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌లో ఉపయోగించే సంకేత భాష. ఈ కార్యక్రమం కొన్నిబాలశిక్షణాలయాలలో అందుబాటులో ఉంది.

చిన్న వయస్సులో పిల్లలు మరొక భాష నేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అవి:

కిండర్ కిట్‌లలో ఉంచబడిన అనేక పుస్తకాలలో ఆస్లాన్ అనువాదాలు అందుబాటులో ఉన్నాయి.

పిల్లల భద్రత, శ్రేయస్సు మరియు అదనపు మద్దతు

పిల్లల భద్రత మరియు శ్రేయస్సు కంటే మరేమీ ముఖ్యమైనది కాదు. వారు పిల్లలను ఎలా సురక్షితంగా ఉంచుతారో మీ సేవా సంస్థను అడగండి.

చిన్నారులందరూ వారి సొంతమైన వేగంతో భిన్నంగా నేర్చుకుంటారు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే మీ బాల్య ప్రారంభ ఉపాధ్యాయునితో మాట్లాడండి. మీకు లేదా మీ పిల్లలకు అదనపు మద్దతు అవసరమైతే, కింది మార్గాల ద్వారా సహాయం అందుబాటులో ఉంటుంది:

బాల శిక్షణా కేంద్రాలలో ఉద్యోగావకాశాలు

విక్టోరియాలో పెరుగుతున్న కిండర్ గార్టెన్లలో వృత్తిని ప్రారంభించడాన్ని పరిగణించండి. బాలకేంద్ర ఉపాధ్యాయుడు లేదా విద్యావేత్త కావడానికి మీకు మద్దతు ఇవ్వడానికి, ఇవి ఉన్నాయి:

Illustration of two children sitting on the floor playing with blocks while two adults talk, speech bubble from one adult with text

మీ కిండర్ కిట్ ని దానం చేస్తున్నారు

మీ బిడ్డ వారి కిండర్ కిట్ వస్తువులను పూర్తిగా వుపయోగించిన తర్వాత, దయచేసి వాటిని బాధ్యతాయుతంగా పారవేయండి.

వస్తువులు మంచి స్థితిలో ఉంటే, వాటిని దాతృత్వ సంస్థకి విరాళంగా ఇవ్వడానికి పరిగణించండి. నేను దీన్ని స్నేహితుడికి ఇస్తానా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధానం అవును అయితే, దాతృత్వ సంస్థకు విరాళం ఇవ్వడం సముచితం.

మీ వస్తువులు దానం చేయడానికి తగినవి కాకపోతే, దయచేసి సాధ్యమైన చోట వాటిని రీసైకిల్ చేయండి.

వ్యర్థాలను తగ్గించడం మరియు సరిగ్గా పారవేయడం వల్ల పరిశుభ్రమైన, పచ్చని విక్టోరియా నిర్మించబడుతుంది.

Education & training

Updated 17 February 2026



About the VIC Government

Grants and programs

Jobs and careers

Arts, culture and heritage

Business and the workplace

Communities

Education and training

Environment, water and energy

Finance and economy

Health and social support

Housing and property

Law and justice

Safety and emergencies

Science and technology

Sport and recreation

Traffic and transport

Working in the Victorian Government